అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎల్ఐసీకి చెందిన సుమారు రూ.2,684.57 కోట్ల నిధులను మోసపూరితంగా దారి మళ్లించారనే ఆరోపణలపై రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఎండీ సతీశ్ సేథ్‌లతో పాటు ఆయనపై ఈ కేసు నమోదైంది. 2012 నుంచి 2018 మధ్య ఎన్సీడీల రూపంలో సమకూర్చిన నిధులను దుర్వినియోగం చేశారని ఎల్ఐసీ ఫిర్యాదు చేయడంతో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.