'మా తప్పుంటే ముక్కు నేలకు రాస్తాం': సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
తెలంగాణ శాసనసభలో 22ఏ భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పచ్చి అబద్ధాల మయమని, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 22ఏ భూముల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి లేదా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైనా బహిరంగ చర్చకు రావాలని, తమ వైపు తప్పు ఉందని నిరూపిస్తే ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. భూభారతి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.