జల సంరక్షణ పద్ధతులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రజెంటేషన్
రిపోర్టర్: రమేష్
స్థలం: జోగులాంబ గద్వాల
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న తొమ్మిదవ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేకంగా పాల్గొని జిల్లా నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటిని పొదుపుగా వినియోగించాలని, భవిష్యత్తు తరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ జల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.