విశాఖలో పోలీసు సిబ్బందికి సీపీఆర్ పై ప్రత్యేక శిక్షణ నిర్వహణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

విశాఖ నగర పోలీసులకు సీపీఆర్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజాగ్ సిటీ పోలీస్ వెల్లడించారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ సహకారంతో రెండు వందల యాభై మంది పోలీసు సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో గుండె సంబంధిత సమస్యలను గుర్తించడం, సకాలంలో సీపీఆర్ ప్రారంభించడంపై ప్రాక్టికల్ శిక్షణ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండు సీపీఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్లను పోలీస్ శాఖకు అందజేసినట్లు పేర్కొన్నారు.