మంగళగిరిలో అర్హులైన పేదలకు నేడు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ

రిపోర్టర్: శివ స్థలం: Guntur

మంగళగిరి నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. సోమవారం కుంచనపల్లిలో నిర్వహించనున్న మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది అర్హులైన లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు రెండు విడతలలో 5,636 మందికి శాశ్వత ఆస్తి హక్కు పత్రాలు అందజేశామని, 2029 నాటికి అర్హులందరికీ పట్టాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.