తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: ఏఐసీసీకి నివేదిక పంపిన పీసీసీ చీఫ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి సమగ్ర నివేదిక సమర్పించినట్లు సీనియర్ నాయకులు తెలిపారు. ఢిల్లీ హోటల్ లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య జరిగిన వాగ్వాదంతో పాటు ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలపై అధిష్టానానికి లేఖ రాశారు. గాంధీ భవన్ కు రావాలని కోరినా నేతలు హాజరుకాకపోవడంపై నివేదికలో స్పష్టంగా ప్రస్తావించారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చకు దారితీశాయి.