కర్నూలులో ప్రశాంత వాతావరణంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్నూలు
కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రసిద్ధ వినాయక ఘాట్ వద్ద ఉన్న కేసీ కెనాల్లో నీటి కొరత ఉన్నప్పటికీ, అధికార యంత్రాంగం కృత్రిమంగా నీటిని నిల్వ చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాజీ ఎంపీలు టీజీ వెంకటేశ్, గోకరాజు గంగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, భజనల మధ్య శోభాయాత్రలు కన్నుల పండువగా సాగుతున్నాయి.