కొత్తజాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన విప్ ఐలయ్య

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని కొత్తజాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు పాలనా సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.