దళిత చిన్నారిపై అఘాయిత్యం ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ధర్మపురి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్ద నక్కలపేటలోని శ్రీ శారద విద్యానికేతన్ పాఠశాలలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ప్రిన్సిపాల్ సల్ల శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని టీవీ వైఎస్, వీబీఏ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాల ఎలా నడుస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.