వైకాపా అధినేత జగన్ బీసీ వ్యతిరేకి: రాజ్యసభ సభ్యుడు విజయ్
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
వైకాపా అధ్యక్షుడు జగన్ బీసీ వ్యతిరేకని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మండిపడ్డారు. రాజకీయంగా బీసీలు ఎదగడం ఆయనకు ఇష్టం లేదన్నారు. గత స్థానిక ఎన్నికల్లో కోర్టులో కేసులు వేయించి బీసీ రిజర్వేషన్లలో కోత విధించారని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం చంద్రబాబు, లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. నర్సీపట్నంలో బుధవారం జరిగే ‘జయహో బీసీ’ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.