తుఫాన్ వేళ ప్రజలకు అండగా నిలవాలన్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అధికారులు సూచించిన ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.