యాదాద్రి క్షేత్రంలో ఘనంగా రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం: భక్తుల మొక్కులు
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాతవేళలో పరమశివుడిని కొలుస్తూ జరిగిన అభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, విభూతితో ప్రత్యేకంగా అలంకరించి అర్చించారు. ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.