వినాయక నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి ఎస్పీ సునీల్ షొరాణ్

రిపోర్టర్: సతీష్ స్థలం: నంద్యాల

నంద్యాల చెరువు కట్ట వద్ద గల వినాయక ఘాట్ నందు నేటి ఉదయం వినాయక నిమజ్జన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనోత్సవాలను ప్రజలందరూ అత్యంత శాంతియుత వాతావరణంలో, ఐకమత్యంతో, సోదర భావంతో కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.