ప్రధాని మోదీ ఆయురారోగ్యాలకై దేవుని సన్నిధిలో వెల్లివిరిసిన భక్తిప్రపత్తులు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ పరిధిలోని 36వ డివిజన్ చాకలి బజార్ శ్రీ కనకదుర్గ దేవస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను మూడవ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రధాని ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ భాజపా నేతలు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు, స్థానికులకు పెద్ద ఎత్తున ప్రసాదాలను పంపిణీ చేశారు. దేశంలో ప్రధాని మోదీ నాయకత్వం వర్ధిల్లాలని, ప్రాంతీయంగా బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.