ఇంగ్లండ్ జట్టులోకి కెవిన్ పీటర్సన్ సంచలన రీఎంట్రీ

రిపోర్టర్: గోపి స్థలం: లండన్

ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ఆ దేశ వైట్-బాల్ క్రికెట్ జట్టుకు స్పెషలిస్ట్ మెంటర్‌గా నియమితులయ్యారు. 2014లో వివాదాస్పదంగా అంతర్జాతీయ కెరీర్ ముగిసిన పన్నెండేళ్ల తర్వాత, బ్రెండన్ మెకల్లమ్ కోచింగ్ సిబ్బందిలో ఆయన మళ్లీ భాగమయ్యారు. సెప్టెంబర్‌లో శ్రీలంకతో జరిగే సిరీస్‌తో తన కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.