'టాక్సిక్' తర్వాత యష్ తదుపరి సినిమాలపై జోరుగా చర్చ!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కర్ణాటక
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పీఎస్ మిత్రన్, ఆదిత్య ధర్, హేమంత్ రావు వంటి ప్రముఖ దర్శకులు యష్‌ను కలిసి భారీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కథలను వినిపించినట్లు ప్రచారం జరుగుతుండగా, రాబోయే చిత్రాలపై త్వరలోనే అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.