దండేపల్లి ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపేందుకు సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈ సిబ్బంది సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ క్షేత్రస్థాయిలో విచారణను వేగవంతం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.