వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు
రిపోర్టర్: సతీష్
స్థలం: గుంటూరు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 50 మందిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేశారని అభియోగం మోపారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన పట్టించుకోకుండా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహన శ్రేణితో విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ చర్య తీసుకున్నారు.