"వినాయక నిమజ్జనంలో విషాదం": చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మండలం పెద్దకంజర్లలో వినాయక నిమజ్జనం సమయంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. నేరెడు చెరువులో విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన శిరీష చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులు ఆరుగురు నీటిలో మునిగి మృతి చెందారు. ఒకరిని మరొకరు కాపాడే ప్రయత్నంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 8, 9, 10 తరగతులు చదువుతున్న పిల్లలు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.