గాదె సాయికృష్ణ కేసులో హోంగార్డు వెంకటరాజుకు బెయిల్ మంజూరు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న హోంగార్డు వెంకటరాజుకు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. నిందితుడు రూ.30 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల నుంచి ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన విజయవాడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో ఈ కేసులో చట్టపరమైన విచారణ వేగవంతం కానుంది.