స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాక్ ఇస్తూ వన్‌ప్లస్‌లో తీవ్ర భద్రతా లోపాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు ఎథికల్ హ్యాకర్ రాస్మస్ మూరాట్స్ వెల్లడించారు. ఎలాంటి అనుమతులు కోరకుండానే హానికర యాప్‌లు ఫోన్‌పై రూట్ యాక్సెస్ పొందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ లోపాలు ఆక్సిజన్ ఓఎస్ రన్ అయ్యే వన్‌ప్లస్ మరియు కొన్ని ఒప్పో ఫోన్లపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ భద్రతా సమస్యలపై వన్‌ప్లస్ స్పందించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు.