క్వాడ్ ఏ దేశానికి వ్యతిరేకం కాదు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

రిపోర్టర్: శివ స్థలం: Atlanta

క్వాడ్ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకంగా పనిచేయడం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అట్లాంటాలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని దేశాల ప్రవర్తనపై మాత్రమే తమ ఆందోళనలు కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య దేశాల మధ్య రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్ లో మరింత సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.