యూఎస్ ట్రెజరీ బాండ్లను తగ్గించుకుంటూ పసిడి నిల్వలు పెంచుకుంటున్న చైనా

రిపోర్టర్: సురేష్ స్థలం: చైనా

ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు తమ అధికారిక మారక నిల్వల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. ముఖ్యంగా చైనా అమెరికా డాలర్ ఆధారిత యూఎస్ ట్రెజరీ బాండ్ల హోల్డింగ్స్‌ను 47 శాతం తగ్గించుకుని 633.4 బిలియన్ డార్లకు పరిమితం చేయగా భద్రత కోసం బంగారు నిల్వలను 2,346.43 టన్నులకు పెంచుకుంది. డాలర్ ఆధిపత్యం నుండి బయటపడేందుకు డీ డాలరైజేషన్ వ్యూహాన్ని చైనా నిలకడగా అమలు చేస్తోంది.