ప్రభుత్వంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం, 22ఏపై పోరాటం.
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో నిషేధిత భూముల 22ఏ వివాదంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల భూములను 22ఏలో చేర్చడం దుర్మార్గమని, సీఎం తన నివాసాన్ని తొలగించుకుని సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.