అర్ణబ్ తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు పాలకొండలో రంగంలోకి ప్రత్యేక బృందాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
అర్ణబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో పాలకొండ నగర పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కమిషనర్ పి.వి. నూకరాజు ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ టీమ్‌ను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, పారిశుద్ధ్యం, రహదారులపై చెట్లు పడే ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.