సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ ఎదుట లొంగిపోయిన ఏ4 సురేశ్

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేశ్ సిట్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన సురేశ్, సాయికృష్ణ అదృశ్యం, మృతి మరియు శవాన్ని మాయం చేసే వ్యవహారాలలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న సురేశ్ కోసం గాలించిన అధికారులు, తాజాగా అతడు లొంగిపోవడంతో విచారణ వేగవంతం చేశారు.