అన్నదాతల ఆక్రోశం: భారీగా పడిపోయిన మిర్చి ధరలతో తీవ్ర నష్టం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఖమ్మం

ఈ ఏడాది మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటను ఆశించిన తెల్లకాయల సమస్య వల్ల దిగుబడి నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్వింటా మిర్చి ధర ఇరవై వేల రూపాయల వరకు పలికినప్పటికీ, ప్రస్తుతం పది నుంచి పన్నెండు వేల రూపాయలకే పరిమితమైందని వ్యాపారులు తెలిపారు. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులను పూర్తిగా అప్పుల ఊబిలో నెట్టేశాయని వారు వాపోయారు.