నిర్మల్ జిల్లా: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Nirmal
నిర్మల్ జిల్లా బాసరలో రానున్న గోదావరి పుష్కరాల కోసం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భైంసా మండలం మాటేగాం గ్రామంలో పర్యటించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని స్పష్టం చేశారు.