కీసర పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల సోదాలు మరియు అరెస్టులు

రిపోర్టర్: సురేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి జరిపిన సోదాలు సంచలనం సృష్టించాయి. ఓ కేసులో బెయిల్ ఇచ్చేందుకు రూ. పది లక్షలు డిమాండ్ చేసిన సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిలను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలోని బృందం చెరువుగట్టు వద్ద రూ. ఐదు లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్సైని అదుపులోకి తీసుకుంది.