అసెంబ్లీకి వచ్చి ఆధారాలతో చర్చించాలంటూ వైకాపాకు మంత్రి నాదెండ్ల మనోహర్ సవాల్
రిపోర్టర్: విజయ్
స్థలం: తెనాలి
రాజకీయ లబ్ధి కోసమే వైకాపా అరాచక శక్తులను రంగంలోకి దించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై అవగాహన లేదని మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అక్రమాలపై ఆధారాలతో చర్చించాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.