ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలతో కొట్టిస్తానంటూ కొండా సురేఖ హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ నేతలంతా వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని, ఒక్కో మహిళ నలుగురిని కొడుతుందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పుతున్నారని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.