హైవేపై ఇరుకు వంతెన బీభత్సం: నిత్యం ప్రమాదాలతో అల్లాడిపోతున్న ప్రయాణికులు

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

జాతీయ రహదారిపై దగదర్తి మండలం అల్లూరు రోడ్డు ఇరుకు వంతెన మృత్యుకూపంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో వందకుపైగా ప్రమాదాలు జరిగి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని వారు వాపోయారు. ఎన్హెచ్ఏఐ, రైల్వే శాఖల మధ్య సమన్వయలోపంతో దశాబ్దాలుగా విస్తరణ నోచుకోవడం లేదని, ప్రజాప్రతినిధులు చొరవ చూపి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి ప్రాణాలు కాపాడాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.