మలబద్ధకం వేధిస్తోందా: ఈ మూడు పండ్లతో సమస్యకు ఇట్టే చెక్ పెట్టవచ్చు
రిపోర్టర్: రమేష్
స్థలం: బెంగళూరు
మలబద్ధకంతో బాధపడేవారు సహజ పండ్ల ద్వారా సులభంగా ఉపశమనం పొందవచ్చని సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే తెలిపారు. బేరి పండ్లు, కివీస్ మరియు ప్రూన్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని పేర్కొన్నారు. పండ్లలో లభించే ఫైబర్, సహజ ఎంజైములు పెద్ద పేగులో నీటి శాతాన్ని పెంచి మలాన్ని మృదువుగా మారుస్తాయని, దీనివల్ల విసర్జన సాఫీగా జరుగుతుందని ఆమె వివరించారు.