గురువులను సత్కరించి పులకించిన ఆమనగల్ విద్యావేదిక

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ పట్టణంలోని మానస గార్డెన్లో మండల విద్యాధికారి పగిడిపాల పాండు ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మండలంలోని 150 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్. పత్యానాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులను సన్మానించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.