'భయంతో వణికిపోయాం..': ఇరాన్లో విమానానికి తప్పిన పెను ప్రమాదం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఇరాన్
ఇరాన్‌లోని మషాద్ నుంచి కెర్మాన్షా వెళ్తున్న సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైర్ సమస్య మరియు ఇంజిన్ అత్యవసర పరిస్థితి తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం గాల్లో తీవ్రంగా కంపించడంతో పాటు క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయంతో కేకలు వేస్తూ ప్రార్థనలు చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.