హర్మూజ్ జలసంధిలో భారీ ఆయిల్ ట్యాంకర్ పేలుడు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో నిషేధిత మార్గంలో ప్రయాణిస్తున్న 'ఎల్ గియా' సూపర్ ఆయిల్ ట్యాంకర్ సముద్రంలో మైన్లను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ పూర్తిగా అగ్నిప్రమాదంలో చిక్కుకుపోగా, మంటలను అదుపులోకి తేవడం విఫలమైంది. ఈ ప్రాంతం తమ నియంత్రణలోనే ఉందని, నిబంధనలు మీరితే ఇలాంటి పెను ప్రమాదాలే ఎదురవుతాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది.