పీటీ టీచర్ వేధింపులపై బాధితురాలి కుటుంబం ఆందోళన

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

అక్షర శ్రీ ప్రైవేట్ పాఠశాలలో పీటీ టీచర్గా పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న ఓ యువకుడు, తనతో సన్నిహితంగా ఉన్న యువతిని పదేపదే నిందిస్తూ, చంపుతానని, తగలబెడతానని బెదిరిస్తున్నట్లు బాధిత యువతి ఆరోపిస్తున్నారు. అంతేకాక, తాను అనుకుంటే ఏమైనా చేయగలనని పేర్కొంటూ యువతి తల్లిదండ్రులను సైతం బెదిరిస్తున్నట్లు, గొడవలు సృష్టించి విడాకుల వరకు వెళ్లేలా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.