ప్రయాణికులకు తీపి కబురు: దేశంలో బుల్లెట్ రైలు నార్తన్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: సునీల్
స్థలం: Varanasi
దేశంలో సరికొత్త రవాణా విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా బుల్లెట్ రైలు నార్తన్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఆమోదించారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వారణాసిలో వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నుంచి ఆగ్రాకు కేవలం యాభై తొమ్మిది నిమిషాలలోనే చేరుకోవచ్చని, లక్నో ప్రయాణం కూడా కేవలం రెండు గంటల్లోనే ముగియనుందని ఆయన స్పష్టం చేశారు.