యాదగిరిగుట్ట భక్తులకు షాక్: నకిలీ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Yadadri Bhuvanagiri

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లను సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో నకిలీ టికెట్లు బుక్ చేసుకుని రూ. 10,000 కోల్పోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనధికారిక పోర్టల్స్ ద్వారా విరాళాలు, సేవల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.