ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో మరో సంచలనం చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించగా, తాజాగా బుధవారం ఈశ్వర్ సాయి భార్య శరణ్య కూడా ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈశ్వర్ లేకపోతే బతకలేనంటూ శరణ్య ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, పరారీలో ఉన్న ఈశ్వర్ సాయి అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.