శ్రీకాకుళం జిల్లాలో కంటైనర్ ట్రక్కులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
రిపోర్టర్: శివ
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్ గేట్ వద్ద సోమవారం ఒక కంటైనర్ ట్రక్కులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వంశధార నది వంతెనపై జరిగిన లారీల ప్రమాదం కారణంగా మొదట అగ్నిప్రమాదానికి గురైన ఈ కంటైనర్ను టోల్ గేట్ వద్దకు తరలించగా, అక్కడ మంటలు మళ్లీ చెలరేగాయి. నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం మరియు ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.