ఆళ్లగడ్డలో రాపిడో సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నంద్యాల

ఆళ్లగడ్డ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం రాపిడో సేవలను అధికారికంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నియోజకవర్గ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ సులభమైన రవాణా సౌకర్యం లభించడంతో పాటు, స్థానిక యువతకు స్వయం ఉపాధి మార్గాలు ఏర్పడేలా ఈ కొత్త సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రవాణా రంగంలో మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు.