ఢిల్లీలో భారీ నకిలీ నాణాల దందా గుట్టురట్టు: నలుగురు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలో భారీ నకిలీ నాణాల తయారీ మరియు సరఫరా ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారని అధికారులు తెలిపారు. ముండ్కా ఇండస్ట్రియల్ ఏరియా మెట్రో స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించి, సుమారు లక్ష రూపాయల విలువైన నకిలీ నాణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.