యువత భవితను కాపాడేలా మత్తు రక్కసిపై పోలీసుల ఉక్కుపాదం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చంద్రగిరి

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి టౌన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతర తనిఖీలు చేపట్టింది. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ సురేష్ కుమార్, పోలీస్ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 176 మంది సందేహితులకు గంజాయి పరీక్షలు చేశారు. యువతను మత్తు పదార్థాల కాటు నుంచి కాపాడి, మంచి భవిష్యత్తును అందించడమే తమ ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయం లేదా అక్రమ రవాణా సమాచారాన్ని డయల్-112కు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.