విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన స్వరం వినిపించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కు వినతిపత్రం సమర్పించారు. చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోయ మధు, మాజీ ఎంపీటీసీ దాచేపల్లి రాజు, మండల ప్రధాన కార్యదర్శి మెండు భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు.