పల్లెపండగతో మారుతున్న గ్రామాల రూపురేఖలు: నెల్లూరు జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

గూడూరు మండలంలోని పాలిచెర్లలో చేపట్టిన చెరువుకట్ట పనులతో పాటు పల్లెపండగ ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన పంచాయతీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. పల్లెపండగ కింద జిల్లాకు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మంజూరు కాగా, వెయ్యికి పైగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.