టెంపుల్ వెంచర్ కు జొమాటో బ్రాండ్ ఇమేజ్ పెద్ద అడ్డంకి అంటూ దీపిందర్ గోయల్ ఆవేదన
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
జొమాటో బ్రాండ్ ఇమేజ్ కారణంగా తన కొత్త హెల్త్ టెక్ వెంచర్ టెంపుల్ను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని ఆ సంస్థ వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్వేర్, సైన్స్ ఆధారిత ఉత్పత్తులను తాను అభివృద్ధి చేయగలనని ప్రజలు నమ్మడం లేదని సోషల్ మీడియా వేదికగా ఆయన స్పష్టం చేశారు. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన టెంపుల్ డివైజ్ ముందస్తు ఆర్డర్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.