రాజమండ్రి అభివృద్ధికి ప్రణాళికలు: నగరంలో రోడ్ల విస్తరణ పనులపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

రిపోర్టర్: అశోక్ స్థలం: తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు రోడ్ల విస్తరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, వెంకటేశ్వర మార్కెట్ రోడ్డు, మొరంపూడి రోడ్డు విస్తరణ పనులతో పాటు పంచాయతీల విలీనం, కొలమూరు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. నగర ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే దిశగా అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.