శ్రీకాకుళంలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల ప్రాథమిక శిక్షణ ముగింపు వేడుకలు

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా తండేవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ల ఆరవ బ్యాచ్ ప్రాథమిక శిక్షణ ముగింపు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొని ట్రైనీ కానిస్టేబుళ్లను అభినందించారు. సుదీర్ఘ కాలం పాటు కఠిన శ్రమతో కూడిన ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.