చెత్త కుప్పలు దోమల బెడదతో వణికిపోతున్న పట్టణవాసులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కాగజ్ నగర్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో పలు కాలనీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఓల్డ్ కాలనీ, కాపువాడ మెయిన్ రోడ్, గాంధీ పార్క్ పరిసరాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోడ్ల పక్కన నిల్వ ఉన్న మురుగునీరు, చెత్తతో దోమల బెడద విపరీతంగా పెరిగి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.